BREAKING
ముందస్తు గుర్తింపే రొమ్ము క్యాన్సర్‌కు సరైన రక్ష: కిమ్స్ వైద్య నిపుణులు కార్మికులకు 8 గంటల పని దినాన్ని చట్టంగా తెచ్చింది ఏఐటీయూసీ దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం సేవే లక్ష్యం అభివృద్ధి అభివృద్దే మా విధానం. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బస్సులు ఏర్పాటు చేయాలి మర్రిపాడు మండలమంటే నాన్నకు అమితమైన ప్రేమ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్ దానిమ్మ తోటల్లో ఎండు తెగులుపై శాస్త్రవేత్తలు పరిశీలన దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధితో పాటు పచ్చదనానికి పెద్దపీట నువ్వురుపాడులో టిడిపి అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ చేయూత గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే మా లక్ష్యం: వైసీపీ నాయకుడు గడ్డం రంజాన్ అందరూ ఆశీర్వదించి విజయం చేకూరిస్తే ఆత్మకూరు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా సెగ్మెంట్లో అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు తనకు విజయ సోపానాలు - టిడిపి ఎంపిటిసి అభ్యర్థి ఖాజావలి

జర్నలిస్టుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

Select Suryaa Now
జర్నలిస్టుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

గాజువాక, సూర్య : నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన ‘సాక్షి’ రిపోర్టర్‌ సుబ్బారెడ్డిపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే) గాజువాక కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం గాజువాక తహసీల్దార్‌ త్రినాథ్‌కు పాత్రికేయులు వినతిపత్రం అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం సరైంది కాదని, పాత్రికేయులకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా అధ్యక్షుడు కాకి రాము, గాజువాక అధ్యక్షుడు కోయిలాడ పరశురామ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కోటిరెడ్డి, సాక్షి గాజువాక ఇన్‌ఛార్జి ప్రదీప్‌ నాయుడు, రిపోర్టర్లు సందీప్‌, శ్రీనివాస్‌, రవికుమార్‌, మహేష్‌, సంతోష్‌, గోవింద్‌, మూర్తి, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.