BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

జనసేన ఎమ్మెల్యే బాలరాజుపై పవన్ కల్యాణ్ సీరియస్

Select Suryaa Now
జనసేన ఎమ్మెల్యే బాలరాజుపై  పవన్ కల్యాణ్ సీరియస్

-పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై విచారణకు కమిటీ

-జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ

-బాలరాజు వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పవన్

-గతంలో హెచ్చరించినా తీరు మారకపోవడంతో ఆగ్రహం

-కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రకటన

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న ఆరోపణల వ్యవహారంపై డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. బాలరాజుపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు పవన్ కల్యాణ్ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం పార్టీలో అంతర్గతంగా కలకలం రేపుతోంది.

గత కొంతకాలంగా ఎమ్మెల్యే బాలరాజు వ్యవహారశైలి, పనితీరుపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల మీడియాలో ఆయనపై ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. గతంలోనే బాలరాజును పార్టీ కార్యాలయానికి పిలిపించి, గిరిజన ప్రజలకు పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందించాలని, వారి సేవకే అంకితం కావాలని పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా సూచించారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడంపై పవన్ తీవ్ర అసహనం, విసుగుతో ఉన్నట్లు పార్టీ ప్రకటనలో పేర్కొన్నారు.

ఓవైపు 'అడవితల్లి బాట' వంటి కార్యక్రమాల ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పార్టీ కృషి చేస్తుంటే, అదే గిరిజన ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి వ్యవహారశైలిపై వస్తున్న ఆరోపణలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ ఈ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను నిగ్గు తేల్చి, పార్టీ అధ్యక్షుడికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై తదుపరి చర్యలు ఉంటాయని జనసేన పార్టీ స్పష్టం చేసింది. దీంతో బాలరాజు రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.