జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేయండి
*న్యాయ వాదులకు జడ్జి కందికట్ల రాణి
కొత్తూరు నవంబర్ 17(మేజర్ న్యూస్) డిశంబర్ పన్నెండు న జరిగే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేవిధంగా చూడాలని మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి న్యాయ వాదులకు ఆదేశించారు.స్థానిక కోర్టు ఆవరణలో మంగళవారం న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జి ఈ విధంగా అన్నారు. రాజీ పడదగ్గ క్రిమినల్ ,సివిల్ కేసులు,మనోవర్తి ,చెక్ బౌన్స్ కేసులు ,ప్రాంసరీ నోట్ కేసులు ఎక్కువగా రాజీ అయ్యేటట్లు కృషి చేయండి అన్నారు.ఈ అవకాశాన్ని కాక్షిదారులు సద్వినియోగం చేసుకొంటే డబ్బు మరియు సమయం అదా చేసుకోవచ్చునని జడ్జి రాణి అన్నారు కార్యక్రమం లో బార్ ప్రసిడెంట్ సి హెచ్ రవి కిరణ్ ,ఏ జి పి అప్పారావు , ఉమామహేశ్వరరావు, ఏ ధర్మారావు,ఆర్ రాజు, ఫల్గుణ రావు,సి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.