BREAKING
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు

ఇంటి పన్నులో డోర్ నెంబర్ తోపాటు యజమాని పేరును చేర్చాలి - సిపిఎం డిమాండ్

Select Suryaa Now
ఇంటి పన్నులో డోర్ నెంబర్ తోపాటు యజమాని పేరును చేర్చాలి -  సిపిఎం డిమాండ్

నెల్లూరు/ వేదాయపాలెం, మేజర్ న్యూస్ :  భగత్ సింగ్ కాలనీలో ఇంటి పన్నులు డోర్ నెంబర్  తోపాటు ఇంటి యజమాని పేరును రాయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు షేక్ మస్తాన్ బి డిమాండ్ చేశారు.గురువారం   నెల్లూరు సిటీ 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ సచివాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సామూహిక మహాధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ బి,జి నాగేశ్వర రావు లు సంయుక్తంగా మాట్లాడుతూ.. భగత్ సింగ్ కాలనీ ఏర్పడి దాదాపు20 సంవత్సరాలు కావస్తున్నా డ్రైనేజీ నీరు వెళ్లే అవుట్ లెట్ లేకపోవడంతో సైడ్ కాలువలు దోమలకు ఉత్పత్తి కేంద్రాలుగా మారాయని.. సాయంత్రం అయితే విజృంభిస్తున్న దోమల ధాటికి ప్రజలు కనీసం ఆరుబయట కూర్చునే పరిస్థితి కూడా లేదని.. దోమల వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని డ్రైనేజీ నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా  అవుట్ లెట్స్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యకార్మికుల సంఖ్యనుపెంచి దోమల నివారణ చర్యలు చేపట్టాలని..ఇంటి పన్నులు డోర్ నెంబర్ తో వేశారనే సాకుతో బలవంతంగా వసూలు చేస్తున్నారని.. ఇకమీదట అలా కాకుండా డోర్ నెంబర్ తోపాటు సంబంధిత ఇంటి యజమాని పేరును చేర్చాలని.. భగత్ సింగ్ కాలనీలో నివసించేఇళ్లకు ఇళ్ల స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు కాకుండా శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని..పెన్నా నది రివిట్ మెంట్ వాల్ ను త్వరితగతిన పూర్తి చేయాలని.. హైవే వద్ద అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని..53  మరియు 54 డివిజన్లలో ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేయాలని.. కుళా యిల్లో వస్తున్నమురికి నీటిని అరికట్టి రెండు పూటలా నీటిని సరఫరా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు.. నగర కమిటీ సభ్యులు మూలం ప్రసాద్.. బిపి నరసింహ.. కత్తి పద్మ.. షేక్ జాఫర్అలీ.. షేక్ ఫయాజ్..శాఖ కార్యదర్శులు ఉడతా ప్రసాద్..జి శ్రీనివాసులు..
ఏ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు