ఇది 100 శాతం ప్రజావిజయం
సర్వేపల్లి, మేజర్ న్యూస్ : కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని మెచ్చి ప్రజలు ఇచ్చిన తీర్పు . సర్వేపల్లి వ్యాప్తంగా 10400 మెజార్టీ సాదించాం. పంచాయతీలు, సహకార ఎన్నికల్లోనూ ప్రజాశీస్సులు మాకే. ఓటమిపై సమీక్షించుకోవాల్సింది పోయి....మాపై నోర్లు పారేసుకుంటున్నారు. నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ జెడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలకు ఆత్మీయ సత్కారం చేసిన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ప్రజాశీస్సులతో సర్వేపల్లిలో ఐదు ఎంపీపీలు, ఐదు జెడ్పీటీసీలను గెలుచుకున్నాం టీడీపీ 52 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించగా, జనసేన, బీజేపీ ఒక్కొక్క స్థానంలో గెలుపొందాయి 5 ఓట్లు, 7 ఓట్లు, 19 ఓట్లు వంటి స్వల్ప తేడాతో అనేక స్థానాలు కోల్పోయాం నియోజకవర్గ వ్యాప్తంగా 10,400 ఓట్ల మెజార్టీ సాధించడం సంతోషంగా ఉంది వైసీపీ నేతలు చెబుతున్నట్టు మేము ఎక్కడా దుర్మార్గాలు చేయలేదు...100 శాతం ప్రజలు ఇఛ్చిన తీర్పు ఇది నామినేషన్ల ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అత్యంత పారదర్శకంగా జరిగింది కొన్ని మండలాల్లో రావల్సిన మెజార్టీ కంటే తగ్గింది..దానిపై సమీక్షించుకుంటున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ మంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంతో ఈ విజయం సాధ్యమైంది నెల్లూరు జిల్లాలో కార్పొరేషన్, మున్సిపాలిటీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం..రెండు, మూడు ఎంపీపీలు, రెండు జెడ్పీటీసీలు మాత్రమే కోల్పోయాం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేశాం..ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల ప్రక్రియలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తెలిపిన ఆమోదం ఇది పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది ఓటమిని సమీక్షించుకోవాల్సిందిపోయి....మాపై నోరుపారేసుకుంటున్నారు వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, దుర్మార్గాలకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి స్పష్టమైన తేడాను ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత సహకార సంఘాల ఎలక్షన్స్ రాబోతున్నాయి.. ఆ ఎన్నికల్లోనూ ప్రజల ఆశీస్సులు మావైపే ఉంటాయి కొత్తగా ఎన్నికవుతున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, సర్పంచ్ లు స్థానిక సంస్థల నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తారు ఆర్&బీ, ఇరిగేషన్, ఆర్.డబ్ల్యూ.ఎస్ తదితర శాఖల నుంచి మేం నిధులు తెచ్చి అభివృద్ధికి కృషి చేస్తాం అందరం సమన్వయంగా కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకునే పెద్ద వరాన్ని ఈ విజయం రూపంలో ప్రజలు మాకు ఇఛ్చారు అభివృద్ధి, సంక్షేమమే కాదు..పెట్టుబడులు, పరిశ్రమల సాధనలోనూ ఆంధప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉంది ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖలో జరుగుతున్న సదస్సుకు దేశవిదేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు నోర్లు అదుపులో పెట్టుకోవాలని, అబద్ధాలకే పరిమితమైన సాక్షి నిజాలు రాయాలని ఆశిస్తున్నాం