హోరాహోరీగా ఇంటింటి ప్రచారం హాజరుకానున్న మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి
వెల్దుర్తి, మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రవీంద్రనాథ్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మండలంలోని అనకలవీధి, రాణి తోటతో పాటు 13, 14, 15, 16వ వార్డులలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ఓటర్లను నేరుగా కలుస్తూ తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించనున్నారు. కాగా, రవీంద్రనాథ్‌రెడ్డి నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమానికి పత్తికొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.