BREAKING
ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం తాడిగడప అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు బోడె ప్రసాద్ ప్రచారం సింగూరుకు మరో సువర్ణావకాశం: టాటా నానో నిష్క్రమణ తర్వాత 18 ఏళ్లకు ట్రక్కుల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అశోక్ లేలాండ్! తాడిగడపలో కూటమి అభ్యర్థులకు బోడె హేమ ప్రచారం

హోంగార్డుల కుటుంబాలకు బీమా చెక్కులు అందజేత

Select Suryaa Now
హోంగార్డుల కుటుంబాలకు బీమా చెక్కులు అందజేత

విజయవాడ క్రైం, మేజర్ న్యూస్: రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు యాక్సిస్ బ్యాంకు తరఫున అందించే ప్రమాద బీమా పరిహారం చెక్కులను ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ శనివారం అందజేశారు. విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంగార్డు తంగేళ్లమూడి రాజశేఖర్ (HG 308) కుటుంబానికి రూ.34 లక్షల బీమా చెక్కును, అదేవిధంగా 16-07-2026న రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు జి.వి. నాగేశ్వరరావు (HG 956) కుటుంబానికి రూ.38 లక్షల బీమా చెక్కును అందించారు. ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ హోంగార్డు విభాగంలో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ 16-08-2026న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. యాక్సిస్ బ్యాంకులో ఖాతాలు కలిగిన పోలీసు సిబ్బంది ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు ప్రమాద బీమా కింద పరిహారం అందించే సౌకర్యం ఉంది. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత ఐపీఎస్, యాక్సిస్ బ్యాంక్ సర్కిల్ హెడ్ పద్మప్రియ, క్లస్టర్ హెడ్ వలి, బ్రాంచ్ మేనేజర్ ప్రదీప్, హోంగార్డు ఆర్‌ఐ సుధాకర్ రెడ్డి, ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. సోమయ్య, అసోసియేషన్ సభ్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.