హొళగుందలో సీసీ రోడ్లు ప్రారంభం
హొళగుందలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
హొళగుంద, సూర్య (ఆలూరు): కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుందలో రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కూటమి నాయకులు సోమవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివప్రసాద్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రజల రాకపోకలకు సౌకర్యం కలగడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. పనులను నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.