హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
గూడూరు, మేజర్‌న్యూస్ : డక్కిలి మండలం సంగనపల్లి గ్రామంలో జరిగిన శనగ అంకయ్య హత్య కేసులో ముద్దాయికి గూడూరు ఏడవ జిల్లా కోర్టు జడ్జి జీవిత ఖైదుతో పాటు 15వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎపిపి వసంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎపిపి మాట్లాడుతూ 2017 సంవత్సరంలో శనగ అంకయ్యతో పాత కక్షల నేపథ్యంలో తమ్ముడు శనగ శ్రీరాములు కర్రతో తలపై దాడి చేసి అంకయ్యను హత్య చేశాడని తెలిపారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి చార్జిషీట్ ఫైల్ చేయడం జరిగిందని, సాక్షాదారాలను పరిశీలించి ఏడవ అదనపు జిల్లా జడ్జ్ వెంకట నాగ పవన్ ముద్దాయి శ్రీరాములుకు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించారన్నారు. ఈ కేసులో సకాలంలో పోలీసులు విచారణ జరిపి చార్జిషీట్ వేసినట్లు తెలిపారు. లైజనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ రావు ,కోర్టు కానిస్టేబుల్ రామకృష్ణ సకాలంలో సాక్షులను కోర్టు ముందు ఉంచడంలో సహకరించారని వారిని ఎస్‌పి అభినందించారు.