గుత్తి, పామిడి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జెడ్పీ సీఈఓ.. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు సూచనలు..
(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గుత్తి, పామిడి మండలాల్లో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను జిల్లా పరిషత్ సీఈఓ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ఎన్నికల విధుల నిర్వహణకు నియమించిన పోలింగ్ అధికారులు అదనపు పోలింగ్ అధికారులు హాజరు, ఎన్నికల సిబ్బందికి కల్పించిన భోజన సదుపాయాలు, బస్సుల ఏర్పాటు, రూట్ ఆఫీసర్ల విధులు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, భోజన వసతులు సమకూర్చాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, అధికారులకు తగిన సూచనలు చేశారు.