గుండెపోటుతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన డా. టేకూరి నాగేశ్వరరావు
పాములపాడు: మండల పరిధిలోని వేంపెంట గ్రామానికి చెందిన మైల చిన్నసుబ్బయ్య (40) గుండెపోటుతో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు డా. టేకూరి నాగేశ్వరరావు మృతుడి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇస్తూ రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ ఘటనపై వేంపెంట టీడీపీ గ్రామ అధ్యక్షురాలు, జూటూరు-1 ఎంపీటీసీ టేకూరి రామసుబ్బమ్మ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, తిరుపాలు నాయక్, జీవన్న, లెనిన్ బాబు, ముద్దపాటి ప్రసాద్, ప్రసన్న, జనసేన శేషు, చిన్నస్వామి ఆచారి, రాధాకృష్ణ, బోయ వెంకట రాముడు, జనార్ధన్ నాయక్, నాగేశ్వర నాయక్, సురేష్, కిరణ్, గాండ్ల సుబ్బారావు, రమేష్, సుబ్బరాయుడు, మహేష్, రఘు నాయక్, నారాయణ స్వామి నాయక్, మంగలి రామచంద్రుడు, మధుసూదన్ రెడ్డి, ఎల్ల సుబ్బడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.