BREAKING
చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన హంటింగ్టన్ వ్యాధి చికిత్సకు యూనిక్యూర్ జీన్ థెరపీ...మే 1, 2027 నాటికి నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌డీఏ! తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం.

గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమం

Select Suryaa Now
గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమం

గరుగుబిల్లి, సూర్య : చదవడం మాకిష్టం కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమమని ఈమేరకు గ్రంథాలయంలో నిర్వహిస్తున్న చదవడం మాకిష్టం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని గరుగుబిల్లి శాఖా గ్రంధాలయం నిర్వాహకులు నల్ల మధుసూదనరావు పేర్కొన్నారు.మండల కేంద్రంలోని శాఖా గ్రంధాలయంలో ఆదివారం ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు చదవడం మాకిష్టం కార్యక్రమమును నిర్వహించారు.చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా పధ్యములు, గద్యములు,కథలు చెప్పడం తోపాటు క్విజ్ పోటీలు స్టోరీ టెల్లింగ్ లో భాగముగా ఆదికవి నన్నయ్య జీవిత చరిత్ర విద్యార్థి చదవగా విద్యార్థులు వినడం జరిగింది.స్పోకెన్ ఇంగ్లీష్ మరియు క్రీడా పోటీల్లో భాగముగా ఈరోజు క్యారం బోర్డు, లూడో,చదరంగం బిజినెస్ మొదలగు ఆటలు ఆడించడం జరిగిందని శాఖా గ్రంధాలయం నిర్వాహకులు నల్ల మధుసూదనరావు పేర్కొన్నారు.అదే విధముగా  పుస్తక పఠనము ద్వారా మనోవికాసం పెంచడం జ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి విజయనగరం పార్వతిపురం మన్యం జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు గ్రంథాలయంలో ప్రతి ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గ్రంథాలయ నిర్వాహకులు మధుసూదనరావు వెల్లడించారు.ఈకార్యక్రమంలో  రౌతు శ్రీనివాసరావుతో పాటు  అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.