BREAKING
ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.ఏడు మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష ప్రజా సమస్యలపై వెలంపల్లి పోరాటాన్ని అడ్డుకోవద్దు : వైసీపీ మాజీ కార్పొరేటర్ల హెచ్చరిక ఈసీ వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: అదుపులోకి తీసుకున్న ఎంపీల విడుదల

గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడి అరెస్ట్

Select Suryaa Now
గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడి అరెస్ట్

ఏలూరు,మేజర్ న్యూస్: జిల్లా పోలీసులు చేపడుతున్న కఠిన చర్యల్లో భాగంగా గంజాయి అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడుతున్న భవిరి జగదీష్  32 సంవత్సరాలు ఆర్ఆర్ పేట ఏలూరు అనే యువకుడి పై గంజాయి అక్రమ రవాణా నిర్బంధ చర్యలు చేపట్టారు. భవిరి జగదీష్ పై గతంలో ఏలూరు రూరల్   పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, కలిగి ఉండటం తదితర  ఎన్ డిపిఎస్ కేసులు నమోదై ఉన్నాయి. అతని నిరంతర మాదకద్రవ్య కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని, ప్రజారోగ్యానికి,సమాజానికి కలిగే ముప్పును నివారించేందుకు నిర్బంధ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు.ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రెవెన్యూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి ఉత్తర్వులు ద్వారా భవిరి జగదీష్ నిర్బంధించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లా పోలీస్ సూపరింటెండెంట్,ఏలూరు,సబ్-డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఏలూరు వారి సూచనలు, ఆదేశాల మేరకు,ఏలూరు వన్ టౌన్ సిఐ కె.రామ కృష్ణ, ప్రభుత్వ డిటెన్షన్ ఆర్డర్‌ను చట్టపరమైన విధానాలను పాటిస్తూ అమలు చేసి,డిటెన్యూను కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం  సెంట్రల్ ప్రిజన్,రాజ మహేంద్ర వరంకు తరలించారు. ఏలూరు జిల్లా పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణా,విక్రయం, నిల్వ, వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతరం కఠిన చర్యలు కొనసాగిస్తునారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేసి, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పోలీస్ అధికారులు తెలిపారు.