ఘనమైన చరిత్ర గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక ఒంగోలు
ఎందరో పోరాట వీరులు, కవులు, చరిత్రకారుల అందించిన గడ్డ ఒంగోలు. ఒంగోలు మున్సిపాలిటీ 150 వసంతాల వేడుకల్లో పాల్గొనడం గర్వంగా, ఆనందంగా ఉంది. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దర్శి మేజర్ న్యూస్ :
ఘనమైన చరిత్ర గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రత్యేకగా ఒంగోలు దేశంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. ఒంగోలు మినీ స్టేడియంలో ఒంగోలు మునిసిపాలిటీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం నిర్వహించిన వేడుకలలో ఒడిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జిల్లా ఇంచార్జి మంత్రిఆనం రామనారాయణ రెడ్డి , విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి , జిల్లా కలెక్టర్ రాజ బాబు , జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు , ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తో పాటు కలిసి దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్బంగాడాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూఒంగోలు మున్సిపాలిటీ 150 వసంతాల వేడుకల్లో పాల్గొనడం గర్వంగా, ఆనందంగా ఉందని గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. ఘనమైన చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఒంగోలు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందన్నారు. ఎందరో పోరాట వీరులు, కవులు, చరిత్రకారులను అందించిన ఈ గడ్డ చరిత్రలో చెరగని ముద్ర వేసుకుందన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఒంగోలుకు ప్రత్యేక స్థానం దక్కడం మనందరికీ గర్వకారణం.,150 ఏళ్ల ఘన చరిత్రకు మరింత ఘనమైన భవిష్యత్తును నిర్మిస్తూ, ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన ప్రజా సౌకర్యాలు, వేగవంతమైన అభివృద్ధితో ఒంగోలును అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలియజేసారు. అనంతరం డాక్టర్ లక్ష్మిని గవర్నర్ కె హరిబాబు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సన్మానించారు.