BREAKING
తాడిగడప మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫామ్‌–బి అందజేత విజయ డెయిరీ అవినీతిపై కోర్టులో పోరాడుతున్నా.. రాజకీయాలకు సంబంధం లేదు అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సన్నద్ధం ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎలాంటి లోపాలకు తావులేకుండా తుది ఓటరు జాబితా రూపొందించాలి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు మొజాంబిక్‌ ప్రతిపక్ష నేత వెనాన్సియో మొండ్లానేకు విచారణ ప్రారంభం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ! పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత" పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం గాజాలో ఆగని మరణమృదంగం.. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల నడుమ అపెక్ సదస్సు యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి – విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు

గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా

Select Suryaa Now
గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండల కేంద్రం కడియం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోరులో కూటమి అభ్యర్థిగా మాజీ ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ బరిలో నిలిచారు. సోమవారం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా తరలివెళ్లి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొనడంతో నామినేషన్ కార్యక్రమం సందడిగా సాగింది.

ఈ సందర్భంగా వెలుగుబంటి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో కడియం గ్రామ సర్పంచ్‌గా, మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) బాధ్యతలు నిర్వహించడంతో పాటు పలు పదవుల్లో కొనసాగి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. ఆయా పదవుల్లో ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 

గతంలో తాను నిర్వహించిన పదవులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలను గ్రామ ప్రజలు గుర్తిస్తున్నారని, ఆ అనుభవం, ప్రజల ఆదరణ తనకు మరోసారి విజయాన్ని అందిస్తాయనే పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎంపీపీగా ఉన్న సమయంలో మండలంతో పాటు గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేపట్టామన్నారు

ప్రస్తుతం రాష్ట్రంలో తమ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున గ్రామ ప్రజలు తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే ప్రభుత్వ సహకారంతో కడియం గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానన్నారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గతంలో తనకు అందించిన ఆదరణను మరోసారి అందించి సర్పంచ్‌గా గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.

కడియం గ్రామ అభివృద్ధికి తన అనుభవాన్ని, ప్రభుత్వ సహకారాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని సత్యప్రసాద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.