గీతం బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో వైద్య శిభిరం
విశాఖ ఎడ్యుకేషన్,అక్టోబర్ 6 మేజర్ న్యూస్ : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ఉన్నత్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆనందపురం మండలంలోని పెద్దిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని పలు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్పోరేట్ సిటిజన్ షిప్ గ్రూప్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ పి.షీలా తెలిపారు. గ్రామంలో మంగళవారం గీతం ఆసుపత్రికి చెందిన జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులతో పాటు ఆర్థోపెడిక్, ఫిజియోథెరిపీ, పిడియాట్రిక్స్, నేత్ర మరియు గైనకాలజీ నిపుణులు సహయంతో మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించామని తెలిపారు. దాదాపు 120 మందికి పైగా గ్రామస్తులు ఈ వైద్య శిభిరానికి హజరయ్యారని, ఉచితంగా మందులను సహితం అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ఉన్నత్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ మంజుశ్రీ, డాక్టర్ సుధ, డాక్టర్ రేణుక, డాక్టర్ నితిన్ పర్యవేక్షించారని తెలిపారు. కాగా రానున్న రోజులలో గ్రామంలో ఉపాధి శిక్షణ మరియు గ్రామీణాభివృద్ది కార్యక్రమాలను సహితం నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గీతం ఎన్.ఎస్.ఎస్ వలంటీర్లను, గీతం ఆసుపత్రి వైద్య సిబ్బందిని స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజా.ఫణి పప్పు అభినందించారు.