గవినివారిపాలెంలో కార్టన్ సెర్చ్
గవినివారిపాలెంలో కార్టన్ సెర్చ్
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తీవ్ర సమస్యాత్మక గ్రామమైన బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానస్పద ఇళ్లలో సోదాలు నిర్వహించి.. 34 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకొన్నారు. అదేవిధంగా గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపును గుర్తించి 29 మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్బంగా డీఎస్పీ ఎండీ మొయిన్ మాట్లాడుతూ గ్రామంలో రాజీకీయ అల్లర్లు, గొడవలకు పాల్పడే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించామని అన్నారు.వివాదాస్పదమైన ఈ గవినివారిపాలెం గ్రామంపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఈపూరుపాలెం ఎస్సై రామాంజనేయులు, వేటపాలెం ఎస్సై జనార్దన్, చీరాల టూటౌన్ ఎస్సై రవీంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.