BREAKING
సరోగసీలో చట్టబద్ధతకు పెద్దపీట: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె. ఆనంద్‌ గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ అరాఫ్తా షూటింగ్ అనుభవాలు పంచుకున్న టర్కిష్ నటులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి ఫ్లైదుబాయ్ పైలట్ సాహసాన్ని కొనియాడిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ గోవింద నామ స్వర్ణతో మారుమోగిన వెంకటనారాయణ నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డీప్‌‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు రైతులకు తమిళనాడు ప్రభుత్వం కొండంత అండ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక మాజీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో ఆర్‌బీఓఎల్ సీఈవో జాతీయస్థాయిలో సత్తా చాటిన ఉమామహేశ్వరపురం విద్యార్థిని. దళిత ఉప సర్పంచ్ పై దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు దళిత, బహుజన సంఘాల ధర్నా పేరూరు గురుకులంలో ఆధునిక హంగులు పేదలకు ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి

గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

Select Suryaa Now
గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

పల్లిపాడు, అక్టోబర్ 2 :   మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, సమానత్వం, మానవత్వం వంటి విలువలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.  శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని కలెక్టర్ సందర్శించి, గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఆశ్రమంలోని గాంధీజీ ఛాయాచిత్ర ప్రదర్శనశాలను తిలకించి నిర్వాహకులను అభినందించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కాలానుగుణంగా పరిస్థితులు మారుతున్నప్పటికీ గాంధీజీ బోధించిన సత్యం, అహింస, సమానత్వం వంటి విలువలు సమాజానికి నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. గాంధీజీని స్మరించుకోవడంతో పాటు ఆయన ఆశయాలను మన ఆలోచనలు, ప్రవర్తనలో ఆచరించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.  పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని, ఆశ్రమ అభివృద్ధి, నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేసి పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆశ్రమంలోని మ్యూజియాన్ని మరింత అభివృద్ధి చేసి, గాంధీజీ జీవితం, సిద్ధాంతాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్రను భావితరాలకు పరిచయం చేసేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆశ్రమ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ ఆశ్రమాన్ని మన సొంత ఆస్తిగా భావించి సంరక్షించుకోవాలని, గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించే స్ఫూర్తిదాయక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  అవనిగడ్డ ఎమ్మెల్యే,  శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ…1921లో మహాత్మా గాంధీజీ స్వయంగా ఇక్కడ ప్రారంభించిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగినదని తెలిపారు. ఎందరో దేశసేవకులకు ఈ ఆశ్రమం స్ఫూర్తినిచ్చిందని, నెల్లూరు జిల్లాకు చెందిన వందలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు గుర్తుగా వారి పేర్లను శిలాఫలకాలపై చెక్కడం ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను గుర్తుచేస్తుందన్నారు. భావితరాలు మహనీయుల జీవిత విశేషాలను తెలుసుకుని, వారి స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి: ఈ కార్యక్రమంలో తెలంగాణ  శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్, ఆశ్రమ కమిటీ నిర్వాహకులు, రెడ్ క్రాస్ సభ్యులు, స్వాతంత్ర్య సమరయోధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.