BREAKING
ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి ఉపాధిహామీ నిధులతో రహదారుల నిర్మాణం మండపేట మున్సిపాలిటీకి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం

గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Select Suryaa Now
గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పామూరు, మేజర్ న్యూస్ : 

 మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి, కనిగిరి నియోజకవర్గం క్లస్టర్‌-11 ఇన్‌చార్జ్ అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని బొట్లగూడూరు పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. గ్రామసభల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ ఎంపీడీవో సుందర రామయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రగొల్ల బాల, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గరీబా, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పద్మజ, ఫీల్డ్ అసిస్టెంట్ ఆవుల నరసింహం, అంగన్‌వాడీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.