ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
హెచ్.ఐ.వి/ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి పిలుపు
పార్వతీపురం లో ఘనంగా 'రెడ్ రన్' మారాథాన్ ర్యాలీ
ఎస్.వి.డి కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ఉత్సాహంగా సాగిన 'రెడ్ రన్' మారాథాన్
పార్వతీపురం, సెప్టెంబర్ 30: మేజర్ న్యూస్ :
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారి, డా. ఎస్.కె. హాఫిజ్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ, ట్రాఫిక్ పోలీస్, మున్సిపాలిటీ సిబ్బంది మరియు దిశా టీమ్ సభ్యులు సహకారంతో జిల్లా స్థాయి "రెడ్ రన్" మారథాన్ ర్యాలీని బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి పాల్గొని జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక ఎస్.వి.డి డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమై కలెక్టరేట్ వరకు ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి ప్రస్తుతం నియంత్రణలో ఉందని, దానిని పూర్తిగా నిర్ములన చేయాలని, అందుకు హెచ్.ఐ.వి,ఎయిడ్స్ పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగిఉండాలని తెలిపారు. యువత, ప్రజల్లో హెచ్.ఐ.వి,ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించడమే ఈ మారథాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, హెచ్.ఐ.వి నివారణా మార్గాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.జిల్లా కుష్ఠు, ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారి, డా. ఎస్.కె. హాఫిజ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి వారి అదేశాలు మేరకు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలలో భాగంగా హెచ్ఐవి/ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన పెంచడం మరియు ఆరోగ్య విద్యను అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ వి డి కళాశాల వద్ద ప్రారంభమై కలెక్టరేట్ వద్ద ముగిసిన ఈ కార్యక్రమంలో 117 మందిపాల్గొన్నారని, వారిలో 7 గురు మహిళా రన్నర్లు కూడా ఉన్నట్లు తెలిపారు.పురుషుల విభాగంలో ముగ్గురు, మహిళల విభాగంలో ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేశామన్నారు. విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నగదు బహుమతి అందజేయడం జరుగుతుందన్నారు.
"రెడ్ రన్" మారాథాన్ ర్యాలీలో మొత్తం 117 మంది పాల్గొన్నారు. అందులో బాలుర విభాగంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాలూరు విద్యార్థులు ఎం. హరీష్ మొదటి స్థానం, ఎన్. నిరంజన్ రెండవ స్థానం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సీతంపేట విద్యార్థి
ఎం. అజిత్ మూడవ స్థానం సాధించగా, బాలికల విభాగంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుమ్మలక్ష్మీపురం విద్యార్థిని బి. స్పందన మొదటి స్థానం, ఎస్. వి. డి. డిగ్రీ కళాశాల విద్యార్థిని బి. రేణుక రెండవ స్థానం, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల, పులివెందుల విద్యార్థిని పి. శివమల్లి మూడవ స్థానం లో గెలుపొందారు. వీరికి మొదటి బహుమతిగా పది వేల రూపాయలు, రెండవ బహుమతి ఏడు వేల రూపాయలు ప్రశంసాపత్రం అందజేయగా, మిగిలిన వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఒ డాక్టర్ పద్మావతి, డి పి ఎం ఒ డాక్టర్ రవికుమార్, జిల్లా క్రీడల అబివృద్ధి అధికారి డాక్టర్ శ్రీధర్, డాక్టర్ జగన్ మోహన్ రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.