BREAKING
వైయస్సార్ పార్టీ పేటేరు ఎంపీటీసీగా రెబ్బ నాగమణి నామినేషన్ నార్లాపూర్‌లో అభివృద్ధి పనులు శరవేగం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పేదలకు సీఎం సహాయనిధి అండ. రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు! ఏఎస్పీ హనుమంతరావు *సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక* ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు పేటేరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు *అల్లం పంటలో కొత్త తెగులు.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన!*

ప్రశాంత ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి

Select Suryaa Now
ప్రశాంత ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి

ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు మండలంలో జడ్పిటిసి, ఎంపిటిసి సభ్యుల ఎన్నికల కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరిగేలా అన్ని పార్టీల వారు సంపూర్ణ సహకారం అందించాలని ఆత్మకూరు మండల ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ పి. సోమయ్య కోరారు. మంగళవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో పి. రఫీ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ సోమయ్య ప్రసంగించారు. ఆత్మకూరు మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని, అందులో వాసులు ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళలకు, అప్పారావు పాలెం ఎంపీటీసీ స్థానం ఎస్సీ జనరల్ గా, మహిమలూరు ఎంపీటీసీ స్థానం బీసీ మహిళలకు, నువ్వురుపాడు ఎంపీటీసీ స్థానం బీసీ జనరల్ గా, బట్టేపాడు ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళలకు, కరటంపాడు ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళలకు, మురుగుళ్ల ఎంపీటీసీ స్థానం జనరల్ గా, పడకండ్ల ఎంపీటీసీ స్థానం జనరల్గా, చెర్లో యడవల్లి ఎంపిటిసి స్థానం జనరల్ గా రిజర్వ్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం నుండి ఆయా ఎంపిటిసి స్థానాలకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరిస్తామని సోమయ్య పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని ఆయన పేర్కొన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీలు నామినేషన్ల సమయంలో తమ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను అందజేయాలని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలు తో పాటు ఏ ఏ ధ్రువీకరణలు జత చేయాలనే అంశాన్ని ఆయన వివరంగా తెలిపారు.ఈనెల 21వతేదీ నుండి 23వతేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 24వతేదీ నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఈ నెల 27వతేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, నవంబర్ 3వతేదీ పోలింగ్ జరుగుతుందని, అవసరమైతే 4వతేదీ రీపోలింగ్ జరుగుతుందని, నవంబర్ 5వతేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని సోమయ్య పేర్కొన్నారు.ఈ సమావేశంలో వైసీపీ నాయకుడు గడ్డం శ్రీనివాసులురెడ్డి, సిపిఎం నాయకుడు గంటా లక్ష్మీపతి, బహుజన సమాజ్ పార్టీ నాయకులు టి. కృష్ణ, బి. శేషాద్రి, జి. హరీష్, డి.వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ నాయకుడు పీ. లాల్ సిద్ధిక్,బీజెపి నాయకులు వాసిపల్లి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.