ఎస్.రాయవరం మండలంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేసే గ్రామాలివే!
ఎస్.రాయవరం,ఎస్.రాయవరం సెక్షన్ లోని కొన్ని గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఏపీ ఈపీడీసీల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.రామకృష్ణ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, పెదగుమ్ములూరు 33/11 కె.వి సబ్ స్టేషన్ లో, 11 కె.వి చినగుమ్ములూరు ఫీడర్ పై ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్న కారణంగా షట్ డౌన్ తీసుకోవాల్సి వచ్చిందని, దీని వల్ల మంగళవారం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. విద్యుత్ నిలిచిపోయే ప్రాంతాలు...
పెట్టుగోళ్లపల్లి, రామయ్యపట్నం, సీతాపురం గ్రామాల్లోని ఆయా ప్రాంతాల ప్రజలు, వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.