ఎనుములదొడ్డి సర్పంచ్ అభ్యర్థి గా లాయర్ లక్ష్మీకాంత్
ఓట్లతో ఆదరించండి అభివృద్ధిలో అండగా ఉంటా* కుందుర్పి మండల పరిధిలోని ఎనుములదొడ్డి పంచాయితీ సర్పంచ్ గా అడ్వకేట్ లక్ష్మీకాంత్ ఈఎన్నికలో పోటీచేస్తున్నారు. ఓట్లతో తనను ఆశీర్వదించండి అభివృద్ధిలో అండగా ఉంటానంటున్నాడు. ఎల్.ఎల్.బి వరకు చదువుకున్న లక్ష్మీకాంత్ ప్రజాసమస్యలపై అవగాహన ఉండటమే కాకుండా వాటిని పరిష్కరించడంలో అనుభవం కలిగినవాడు. విద్యావంతుడైన లక్ష్మీకాంత్ పంచాయతీ అభివృద్ధి కోసం నిధులను రాబట్టడంలో, పంచాయతీ అభివృద్ధికోసం అవసరమైన వనరులను ఏర్పాటు చేసుకోగలిగిన సామర్థ్యం కలిగినవ్యక్తి.అందర్నీ ఆప్యాయంగా మనస్ఫూర్తిగా పలకరించే లక్ష్మీకాంత్ పంచాయతీ అభివృద్ధిలో సంబంధిత అధికారులతో చాకీచక్కగా మాట్లాడే స్వభావం కలిగిన వాడు. తనకు ఓటువేసి గెలిపిస్తే ప్రజాసమస్యల పరిష్కరించడమే కాకుండా గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరిస్తానంటున్నాడు. టి. రాజు సూర్య రిపోర్టర్ కుందుర్పి