BREAKING
ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం తాడిగడప అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు బోడె ప్రసాద్ ప్రచారం సింగూరుకు మరో సువర్ణావకాశం: టాటా నానో నిష్క్రమణ తర్వాత 18 ఏళ్లకు ట్రక్కుల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అశోక్ లేలాండ్! తాడిగడపలో కూటమి అభ్యర్థులకు బోడె హేమ ప్రచారం

ఎన్‌టీఆర్ పోలీస్ ట్రాఫిక్ వింగ్ ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం

Select Suryaa Now
ఎన్‌టీఆర్ పోలీస్ ట్రాఫిక్ వింగ్ ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం

విజయవాడ క్రైం, మేజర్ న్యూస్: విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ సమాచారాన్ని మరింత సులభంగా అందించడంతో పాటు సురక్షిత ప్రయాణానికి వీలుగా ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్ రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్ ‘ఎన్‌టీఆర్ పోలీస్ ట్రాఫిక్ వింగ్’ను పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ ప్రత్యేక మార్గదర్శకత్వంలో ఖాకీ స్టూడియో ఆధ్వర్యంలో ‘ప్రజల కోసం... సురక్షిత ప్రయాణం కోసం’, ‘ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ’ అనే నినాదాలతో ఈ డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్‌సైట్ ద్వారా నగరంలోని తాజా ట్రాఫిక్ అప్‌డేట్స్, రహదారుల మూసివేతలు, దారి మళ్లింపులు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాలు, రూట్ మ్యాప్స్, పార్కింగ్ ప్రదేశాల వివరాలను ప్రజలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను వీక్షించవచ్చు. తప్పుగా పార్కింగ్ చేసిన వాహనాలు, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే సమస్యలపై ఫొటో, వివరాలు, లొకేషన్‌తో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పించారు. ఫిర్యాదు చేసిన అనంతరం రిఫరెన్స్ నంబర్ ద్వారా దాని పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు మాట్లాడుతూ ట్రాఫిక్ సమాచారం ఇక ప్రజల చేతుల్లోనే ఉంటుందని, ‘మీ సూచన... మా చర్య... మెరుగైన ట్రాఫిక్... మనం అందరం కలసి!’ అనే స్ఫూర్తితో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించామని తెలిపారు. పౌరులు ప్రయాణానికి ముందే వెబ్‌సైట్ ద్వారా ట్రాఫిక్ సమాచారాన్ని తెలుసుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. https://ntr-police-traffic-updates.pages.devలింక్‌పై క్లిక్ చేయడం ద్వారా లేదా ఎన్‌టీఆర్ పోలీసులు విడుదల చేసిన పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ఐపీఎస్, అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత ఐపీఎస్, ట్రాఫిక్ ఏసీపీ డి. పావన్ కుమార్, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి. దుర్గారావు, కమాండ్ కంట్రోల్, ఖాకీ స్టూడియో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.