BREAKING
ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం తాడిగడప అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు బోడె ప్రసాద్ ప్రచారం సింగూరుకు మరో సువర్ణావకాశం: టాటా నానో నిష్క్రమణ తర్వాత 18 ఏళ్లకు ట్రక్కుల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అశోక్ లేలాండ్! తాడిగడపలో కూటమి అభ్యర్థులకు బోడె హేమ ప్రచారం

ఎన్నికల విధుల్లో అప్రమత్తతే కీలకం..

Select Suryaa Now
ఎన్నికల విధుల్లో అప్రమత్తతే కీలకం..

విజ‌య‌వాడ‌, మేజర్ న్యూస్ : పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల (పీవోలు) పాత్ర అత్యంత కీలకమని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. పంచాయతీ ఎన్నికలు–2026 రెండోద‌శ నిర్వహణకు సంబంధించి శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. పోలింగ్ ప్రక్రియలో ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయడంతో పాటు ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, ప్రామాణిక కార్యాచరణ విధానాలను తూచా తప్పకుండా పాటించాలని, విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ఒకేరోజు నిర్వహించనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఒత్తిడి, పోటాపోటీ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని, ఈ నేప‌థ్యంలో అధికారులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత చిత్తంతో, సంయమనంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే సంబంధిత కేంద్రాలకు చేరుకుని అక్కడి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. స్థానిక పోలీసు, రెవెన్యూ సిబ్బంది త‌దిత‌రుల‌తో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. బ్యాలెట్ బాక్సు సిద్ధం చేయడం, సీల్ వేయడం, ఓటరు గుర్తింపు, బ్యాలెట్ పేపర్ జారీ, ఓటు వేసే విధానం, ఓటు రహస్యాన్ని కాపాడటం, చెల్లుబాట‌య్యే, చెల్లని ఓట్లపై అవగాహన, పోలింగ్ ముగింపు, కౌంటింగ్ త‌దిత‌ర అంశాల‌ను మాస్ట‌ర్ ట్రైన‌ర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి టి.సీతామహాలక్ష్మి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి.ప్రభాకరరావు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.