ఎన్నికల వేళ... మధు వీరేష్ కి కీలక బాధ్యతలు
ఎన్నికల వేళ.. మధు వీరేష్‌కు కీలక బాధ్యత!
కాకినాడ రూరల్ జనసేన అసెంబ్లీ సమన్వయకర్తగా నియామకం
కష్టకాలంలో పార్టీకి అండగా.. తుని ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి
కరపలో క్రికెట్ పోటీలతో వందలాది మంది యువతకు ప్రోత్సాహం
పార్టీ నమ్మకాన్ని నిలబెడతాం.. కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటాం: మధు వీరేష్
ఉమ్మడి గోదావరిజిల్లాల సర్య బ్యూరో, కాకినాడ, అక్టోబరు 10: స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల వేళ జనసేనలో దేవు మధు వీరేష్‌కు కీలక బాధ్యత దక్కింది. కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయనను నియమించారు. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు శనివారం ప్రకటించిన స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో ఆయనకు స్థానం కల్పించారు. రాజకీయంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ జనసేనకు అండగా నిలిచి, పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేసిన మధు వీరేష్‌కు ఈ నియామకం మరో ముఖ్యమైన అవకాశంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తుని నుంచి కాకినాడ రూరల్‌కు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో తుని నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జిగా మధు వీరేష్ బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ కూటమి అభ్యర్థి విజయానికి తనవంతు కృషి చేశారు. పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురైన కాలంలోనూ సంస్థాగత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. తునిలో ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయనకు ఇప్పుడు కాకినాడ రూరల్‌లో సంస్థాగత సమన్వయ బాధ్యతలు అప్పగించడం రాజకీయ ప్రస్థానంలో మరో ముందడుగుగా నిలిచింది.
క్రికెట్‌కు అండగా.. యువతకు ప్రోత్సాహం
రాజకీయాలతోపాటు క్రీడారంగంలోనూ మధు వీరేష్ తనవంతు సేవలు అందిస్తున్నారు. క్రికెట్‌పై ప్రత్యేక అభిమానం కలిగిన ఆయన కరప గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. వందలాది మంది యువతకు క్రీడల్లో పాల్గొనే అవకాశాలు కల్పించి, వారి ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేశారని స్థానిక క్రీడావర్గాలు చెబుతున్నాయి. ఈ పోటీల ద్వారా పలువురు క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎదిగేందుకు ప్రోత్సాహం లభించిందని పేర్కొంటున్నాయి. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి స్థానికంగా గుర్తింపు పొందింది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో..
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల నేపథ్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి జనసేన ప్రత్యేక కమిటీని ప్రకటించింది. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం, ఎన్నికల సందర్భంగా నాయకత్వం అప్పగించే బాధ్యతలను నిర్వర్తించడం ఈ కమిటీ ముందున్న ప్రధాన అంశాలు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తూ, అందరినీ కలుపుకొని పనిచేయడంపై కమిటీ దృష్టి సారించనుంది.
పార్టీ నమ్మకాన్ని నిలబెడతాం: మధు వీరేష్
పార్టీ నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని దేవు మధు వీరేష్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అప్పగించే ప్రతి బాధ్యతను పార్టీ పట్ల పూర్తి విధేయతతో నిర్వర్తిస్తామన్నారు. నియోజకవర్గంలోని నాయకులందరినీ కలుపుకొని, కార్యకర్తలకు మరింత వెన్నుదన్నుగా నిలుస్తూ కమిటీ సమష్టిగా పనిచేస్తుందని చెప్పారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలో పార్టీ ఆశయాలకు అనుగుణంగా సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
కాకినాడ రూరల్ జనసేన కమిటీ ఇదే
జనసేన ప్రకటించిన స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో అసెంబ్లీ సమన్వయకర్తలుగా కడలి ఈశ్వరి, దేవు మధు వీరేష్, దూమదుల కిషోర్ నియమితులయ్యారు. నిర్వాహక్ దళ్ సభ్యులుగా గోడవర్థి సందీప్, నక్కా అంజి బాబు, ఆకుల శ్రీ తేజపతి, తిప్పర్తి సురేష్ బాబు, పాండ్రంకి రాజు, నల్లం శ్రీ రాములు, కళ్ల రాజు, యలమంచిలి సూర్య వెంకట భాస్కర రావు, గీసాల వీర ఫణీంద్ర కుమార్, ఎలుదుర్తి లక్ష్మి నారాయణ, నందూరి గంగాధ్రి, కె.దిండు గణపతి, జోకా అప్పల రాజు, రెడ్డిపల్లి భాను కిషోర్, నిమ్మకాయల సత్యనారాయణ, గవర శ్రీ రాములు, పొన్నగంటి జగదీష్, మోటుపల్లి నాగ చక్రవర్తి, బిరుదా వీర వెంకట సత్యనారాయణ మూర్తి, చవ్వాకుల గుణ శేఖర్, మాదాల వెంకటరమణ, టేకు వీర దుర్గ విష్ణు, తిరుమణి కుమార స్వామి, దొడ్డిపట్ల అప్పారావు, పాలేపు శివ కిషోర్, గంజా దుర్గ ప్రసాద్, పంపన ఉమామహేశ్వరరావు, గోపి రమణ, మల్లిపూడి ఆదికేశ్వర, కర్రి శ్రీనివాస్, ముమ్మిడి శ్రీనివాస్ రావు, తోటకూర వీరవెంకట సత్య నారాయణ నియమితులయ్యారు. సపోర్ట్ టీంలో బోగిరెడ్డి గంగాధరరావు, దొల్ల మల్లేశ్వరరావు, ఆకుల మణి కుమార్, డి.శ్రీనివాస్, ఐ.గంగ రాజేష్‌లకు చోటు కల్పించారు.