BREAKING
ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్: వెకేషన్ ముగించి షూటింగ్‌కు రెడీ అవుతున్న డార్లింగ్! రైతులకు నోటీసులు.. రికార్డులు జిల్లా కేంద్రంలో! పిడుగుపాటుతో ఇల్లు ధ్వంసం-పరిశీలించిన సర్పంచ్ కుమారస్వామి కల్యాణలక్ష్మి.. సక్సెషన్ భూముల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన.తహసీల్దార్‌ అశోక్‌ పాశమైలారం హరితహారం పార్కు భూమికి రక్షణ కరువు! పది ఎకరాల పార్కు భూమి ఆక్రమణకు గురైందా? ఆసియా తయారీ రంగానికి ఎదురుదెబ్బ చైనా తీరప్రాంత ఒత్తిడిని ధీటుగా ఎదుర్కొంటాం వీబీ-గ్రామ్ జీ చట్టం కింద నూతన ఫిర్యాదుల పరిష్కారానికి 15 రోజుల గడువు షేర్ మొహమ్మద్ పేట సెగ్మెంట్ 2 లో వాసుదేవరెడ్డి దే విజయం అంటున్న గ్రామస్తులు వైద్య రంగంలో కృత్రిమ మేధ విప్లవం..ఏఐ వైపు అడుగులు వేస్తున్న హెల్త్‌కేర్ సెక్టార్ పిజ్జా హట్, కేఎఫ్‌సీ ఆపరేటర్లకు ఊరట..భారీగా తగ్గిన నష్టాలు, పుంజుకున్న విక్రయాలు జర్మనీ ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ బిపి సంస్థ స్టోన్‌పీక్‌కు కాస్ట్రోల్ వాటా విక్రయం పూర్తి చేసిన ఎనర్జీ దిగ్గజం సౌదీ అరేబియాలో దక్షిణ నగరాల్లో ఆల్-క్లియర్ ప్రకటించిన సివిల్ డిఫెన్స్ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

ఎన్నికల నిర్వహణలో సహకరించిన ఓటర్లు, అధికారులు, పోలీసు సిబ్బంది, మీడియాకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు

Select Suryaa Now
ఎన్నికల నిర్వహణలో సహకరించిన ఓటర్లు, అధికారులు, పోలీసు సిబ్బంది, మీడియాకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు

పార్వతీపురం, నవంబర్ 2 మేజర్ న్యూస్:

 పార్వతీపురం మన్యం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు.

                                   జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం ముందస్తుగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టిందని, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, ఓటర్లకు అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎన్నికల సిబ్బందికి అవసరమైన పోలింగ్ సామగ్రి, విధుల నిర్వహణకు సంబంధించిన సూచనలు అందజేసినట్లు పేర్కొన్నారు.

                                                   ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడం వల్ల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసిందని, జిల్లాలోని సంబంధిత అధికారుల నుంచి అందిన నివేదికల మేరకు ఎన్నికల నిర్వహణ సజావుగా పూర్తయినట్లు తెలిపారు.ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన ఓటర్లకు, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

         అదేవిధంగా ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ ఇదే విధమైన సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి కోరారు.

 

పి సతీష్ కుమార్ స్టాప్ రిపోర్టర్ పార్వతీపురం మన్యం జిల్లా.