ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలి రేపల్లె డిఎస్పి అబ్దుల్ అజీద్
రేపల్లె మేజర్ న్యూస్;
మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని రేపల్లె డిఎస్పి అబ్దుల్ అజీజ్ తెలిపారు ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు వారి మద్దతుదారులు నడుచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నామినేషన్ పరిశీలన ఉపసంహరణ సమయంలో కూడా నిబంధనలు పాటించాలని డిఎస్పి సూచించారు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రాజకీయ పార్టీలు నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు అన్ని రాజకీయ పార్టీలు నాయకులు పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలీసు వారికి సహకరించాలని డిఎస్పీ కోరారు