BREAKING
కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్

ఎన్నికల ఇన్చార్జి రామకృష్ణ కు స్వాగతం పలికిన రామరాజు,నాయుడు

Select Suryaa Now
ఎన్నికల ఇన్చార్జి రామకృష్ణ కు స్వాగతం పలికిన రామరాజు,నాయుడు

నరసాపురం, మేజర్ న్యూస్ :పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొవ్వలి యతి రాజా రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. గురువారంపట్టణంలోని సన్‌రైజ్ హోటల్ నందు  ఇరువురు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని స్థానిక మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర రాజకీయ అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా,