ఎంపీ మిథున్ రెడ్డి ఆశీస్సులతో విజయం సాధిస్తా : 46వ వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థిని ఆర్.లీలావతి ధీమా
మదనపల్లి,మేజర్ న్యూస్ : రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆశీస్సులతో విజయం సాధిస్తానని 46వ వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థిని ఆర్.లీలావతి ధీమా వ్యక్తం చేశారు.మునిసిఫల్ ఎన్నికలలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి వైసిపి అభ్యర్థులకు మద్దతుగా నీరుగట్టువారిపల్లెలో ముమ్మర ప్రచారం నిర్వహించారు.ఇందులో భాగంగా 46 వార్డ్ అభ్యర్థి ఆర్.లీలావతితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.ముందుగా ఆర్.లీలావతి,వెంకటేష్ దంపతులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి గెలిపిస్తేనే మదనపల్లి అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.వార్డులో నెలకొన్న సమస్యలపై మంచి అవగాహన ఉన్న లీలావతికి ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం లీలావతి మాట్లాడుతూ నా గెలుపు కోసం ఎంపీ ప్రచారానికి రావడం ఆనందంగా ఉందన్నారు.ప్రజలు తనకు అవకాశం ఇస్తే వార్డును అన్నివిధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.తన ప్రచారానికి మద్దతు తెలిపిన ఎంపీ మిథున్ రెడ్డి,వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,చైర్మన్ అభ్యర్థి జింక వెంకటాచలపతి,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి,పార్టీ శ్రేణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి