BREAKING
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఇమ్మానియేల్ రాజ్ బాక్సాఫీస్ వద్ద నాని ప్యారడైజ్ సంచలనం.. ఆరో రోజులోనే వంద కోట్ల క్లబ్‌లో అడుగు  పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల్లో పూర్తి చేయాలి సంజీవిని సంస్థకు స్ట్రెచర్ వితరణ సూరి మండడి చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత.. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు ఘనంగా అంగన్వాడి ఉత్సవాలు అరుణాచల్ ప్రదేశ్‌లో విధి నిర్వహణలో ఆర్మీ జవాన్ మృతి ఉరవకొండలో ప్రజాదర్బార్.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి పయ్యావుల కేశవ్ జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ కొనసాగింపు..ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కీలక నిర్ణయం.. ఉరవకొండలో నూతన పాఠశాల కమిటీల చైర్మన్లు, సభ్యులతో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కౌన్సిలర్ కొ క్కిరాల దీప్తి రాకేష్ రావు అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల ఆరోపణలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పంపిణీలో అవకతవకలు జరిగితే సంబంధిత కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు. మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరించండి ఆర్ డి ఓ కు వైఎస్ఆర్సిపి నేతలు వినతి ఫహద్ ఫాజిల్ వ్యాఖ్యలపై ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చ.. భార్య నజ్రియా వయసుపై వివాదం

ఏమైనా పురపాలక సంఘం చైర్మన్ సీట్ మాచానికి ఇవ్వాలి

Select Suryaa Now
ఏమైనా పురపాలక సంఘం చైర్మన్ సీట్ మాచానికి ఇవ్వాలి

మాచని సోమనాథ్ కు మున్సిపల్ చైర్మన్ పీఠం ఇవ్వాలి.. కోనేరు

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
అధికార పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ నేపథ్యంలో టీడీపీ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంటుంది కావున  గత మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, అప్పటి రాజీ వ్యవహారాలపై ప్రజల్లో ఉన్న సందేహాలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు.
చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలని కోరారు. మాచాని సోమనాథ్‌ను చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేస్తే పార్టీకి బలం చేకూరుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చైర్మన్‌గా అవకాశం కల్పిస్తే ఆయన పనితీరు ద్వారా నాయకత్వ సామర్థ్యం వెల్లడవుతుందని పేర్కొన్నారు.
ఎమ్మిగనూరు రాజకీయాల్లో చేనేత, కుర్ణి వర్గాలకు చెందిన నాయకులకు మున్సిపల్ చైర్మన్ పదవిలో అవకాశం కల్పించడం ద్వారా రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని నాగేంద్ర ప్రసాద్ అన్నారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కుర్ణి వర్గాలకు చెందిన వారిని చైర్మన్లుగా చేసి, ఇతర నాయకులు మున్సిపల్ వ్యవహారాల్లో ఆధిపత్యం కొనసాగించారనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి ఎంపిక కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు.