BREAKING
రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు!

ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.

Select Suryaa Now
ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.

*అధికారులకు జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశం.

 సూర్య ప్రతినిధి, మార్కాపురం.

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తలెత్తే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు. 

సోమవారం మార్కాపురం కలెక్టరేట్‌లో ఎల్‌నినో పరిస్థితులు, వాటి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, మైక్రో ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం రానున్న రోజుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలన్నారు.ముఖ్యంగా జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. జిల్లాలోని నీటి వనరులు, ఎస్‌ఎస్‌ ట్యాంకుల పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై మున్సిపల్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. 

తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. 

నీటి కొరత ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చొరవ చూపాలని స్పష్టం చేశారు.

అదే విధంగా జిల్లాలో ప్రస్తుత వ్యవసాయ పంటల పరిస్థితి, వర్షపాతం, తదితర అంశాలను వ్యవసాయ శాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎల్ నినో  పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి పంటలు వేస్తే రైతులకు మేలు చేకూరుతుందో తెలియజేస్తూ వారికి పూర్తిగా అవగాహన కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 

అన్ని శాఖల సమన్వయంతో ఎల్ నినో పరిస్థితులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు ముందుకు సాగుదామని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జ్ అధికారి బాలాజీ నాయక్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఫణీంద్ర కుమార్, డ్వామా పీడీ సువార్త, మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నెమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.