ఎల్ ఆర్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మా కార్యక్రమం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని ఎల్ ఆర్ పల్లి 1 సెంటర్ అంగన్వాడీ కేంద్రం లో బుధవారం పోషణ్ మా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సీడీపీఓ , సూపెర్వైజర్ ఆదేశాల మేరకు జాతీయ పోషణ మాసం 2026 లో భాగంగా అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమం కార్యకర్త ఎస్ కే షకీలా ఘనంగా నిర్వహించారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్ధాలు ప్రదర్శించి తల్లికి సంపూర్ణ భోజనం ప్లేట్ ను అందించారు.కేంద్రం లోని తల్లిదండ్రులు పాల్గొని వారి చిన్నారులు అంగన్వాడీ కి రాకముందు, వచ్చాక తేడాను తెలియజేసి, తమపిల్లలు కేంద్రంకు వచ్చాక ఆటపాటలతో ఇంటిదగ్గర కూడా చక్కగా చెబుతున్నారని కార్యకర్త షకీలాకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ఆయా విజయ, తల్లిదండ్రులు పాల్గొన్నారు.