BREAKING
ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం సంకినేని రవీందర్ రావు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు నిరాధారం పూడివలసలో పోలీసుల పల్లెనిద్ర ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం యువ క్రికెటర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనంతలో ముగిసిన ఆర్డిటి గ్రామీణ క్రికెట్ ప్రతిభాన్వేషణ జిల్లావ్యాప్తంగా 2 వేల మందికి పైగా హాజరు.. చరిత్రలో రికార్డు సోమనాథ స్వామి యాత్రకు బయలుదేరిన 50 మంది భక్తులు జెండా ఊపి ప్రారంభించిన ఆలయ చైర్మన్ చుంచు రమేష్ నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన నేరెళ్ల బాధితులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదు భోగాపురం పంచాయతీ కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున కదిలిన రైతాంగం జల జీవన్ మిషన్‌ను విజయవంతం చేయాలి పెద్దేముల్ రైతు సేవ సహకార సంఘం చైర్మన్‌గా ఎల్లారెడ్డి నాటి జ్ఞాపకాలు.. నేటి ఆత్మీయత బుర్రిపాలెంలో సూపర్‌స్టార్‌ కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి పార్లమెంటరీ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు ప్రాధాన్యం ఏపీలో 'తల్లికి వందనం

ఈ నెల 11న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సదస్సు భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేయాలి

Select Suryaa Now
ఈ నెల 11న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సదస్సు  భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేయాలి

అనంతపురం బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లాలో భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేయాలని, పేదలకు అన్యాయం చేసే అసైన్మెంట్ చట్ట సవరణను రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ ఆదివారం కదిరి పట్టణంలోని ఎన్జీ హోమ్‌లో నిర్వహించనున్న జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కదిరిలోని సీపీఐ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కష్టజీవులు, వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేయాలని, అర్హులైన నిరుపేదలకు భూ పంపిణీ చేపట్టాలని కోరారు. పేదల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అసైన్మెంట్ చట్ట సవరణను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి. కదిరప్ప మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో అనేక మంది కూలీలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

గ్రామీణ కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని, రామ్‌జీ పథకాన్ని రద్దు చేయాలని, కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. భూమి, ఉపాధి వంటి ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి

ఈ నెల 11న కదిరిలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా సదస్సుకు జిల్లావ్యాప్తంగా ఉన్న సంఘం కార్యకర్తలు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉప కార్యదర్శి రమణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మధు నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మహేంద్ర, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పవన్, సీపీఐ పట్టణ కార్యదర్శి ఎస్.కె. ఇలియాకత్ అలీ, పట్టణ సహాయ కార్యదర్శి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.