BREAKING
ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ

ఏ ఎస్ ఆర్ డిగ్రీ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

Select Suryaa Now
ఏ ఎస్ ఆర్ డిగ్రీ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

ఏ ఎస్ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :ఆత్మకూరులోని 
ఏఎస్ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ గంగాధర్‌, ఎస్‌ఐ జంపాని కుమార్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాన్ని, కరస్పాండెంట్‌ సుబ్బారెడ్డిని అతిథులు అభినందించారు. ఈ సందర్భంగా సీఐ గంగాధర్‌ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని తెలిపారు. కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమంలో ఏఎస్ఆర్‌ కాలేజీ చైర్మన్ మట్లి సురేంద్రరెడ్డి, ప్రిన్సిపాల్‌ ఎ. శ్రీనివాసులరెడ్డి, ప్రసాద్‌, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.