BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

డ్వాక్రా మహిళల సంఘ భవనాల నిర్మాణానికి రూ 6.28 కోట్లు

Select Suryaa Now
డ్వాక్రా మహిళల సంఘ భవనాల నిర్మాణానికి రూ 6.28 కోట్లు

మండపేట మేజర్ న్యూస్ : మండపేట నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించు కునేందుకు వీలుగా సంఘ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6.28 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. డ్వాక్రా మహిళలకు గత ఎనిమిదేళ్లుగా రావాల్సిన ధాన్యం కొనుగోలు కమిషన్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లా పరిషత్ సమావేశాల్లో ఈ అంశాన్ని పలుమార్లు ప్రస్తావించడంతో పాటు, అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి నిధులను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదిలీ చేయించినట్లు తెలిపారు.మండపేట నియోజకవర్గం తిరిగి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కావడంతో జిల్లా పరిధిలో రూ.1.15 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారని, దీంతో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లను స్వయంగా కలిసి సమన్వయం చేసి మొత్తం నిధులను సాధించినట్లు వేగుళ్ల వివరించారు.ఈ నిధులతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో డ్వాక్రా సంఘ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. గ్రామాల వారీగా ద్వారపూడికి రూ.1 కోటి, చెల్లూరుకు రూ.90 లక్షలు, నేలటూరుకు రూ.90 లక్షలు, అంగరకు రూ.80 లక్షలు, కేశవరానికి రూ.69 లక్షలు, అర్తమూరుకు రూ.46 లక్షలు, మాచవరానికి రూ.41 లక్షలు, వెంటూరుకు రూ.35.89 లక్షలు, వెదురుపాకకు రూ.33 లక్షలు, వెలగతోడుకు రూ.31 లక్షలు, తాపేశ్వరానికి రూ.27 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.గ్రామ సమాఖ్య సంఘ సమావేశాలు లేని సమయంలో ఈ భవనాలను వివాహాది శుభకార్యక్రమాలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వడం ద్వారా గ్రామ సమాఖ్యలు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

డ్వాక్రా సంఘ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని, నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకువస్తామని వేగుళ్ల జోగేశ్వరరావు స్పష్టం చేశారు