దుత్తలూరు మండలంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
దుత్తలూరు , మేజర్ న్యూస్ : దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి బిజెపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీ పెసల కృష్ణ గారి అధ్యక్షతన , బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులు వేణు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి నాయుడు మాట్లాడుతూ...- కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంఅభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, బిజెపి చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరుతున్నాయని, తెలియజేశారు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు చుండి. హరిగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దుత్తలూరు మండలంలో బిజెపి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. మండలంలో పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, యువతను పార్టీలోకి ఆహ్వానించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు,యువమోర్చా నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.