BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు

Select Suryaa Now
దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 
నెల్లూరు నగరంలోని మూలాపేటలో వేంచేసియున్న శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారి మూలవర్లకు విశేష అభిషేకం, కలశపూజ, చండీహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలవర్ల అభిషేకానికి మెట్టు సురేష్ బాబు, సుభాషిణి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించగా, కలశపూజ, చండీహోమ కార్యక్రమాలకు గేనేడి వెంకటేశ్వర్లు నాయుడు, సునీతమ్మ దంపతులు ఉభయకర్తలుగా పాల్గొన్నారు.
సాయంత్రం అమ్మవారు ప్రత్యేక అలంకారంలో 'దుర్గాదేవి'గా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారానికి జంపని వంశీ కృష్ణ, మాధవి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం కట్టంరెడ్డి ప్రతాప్ రెడ్డి, సుమన దంపతుల ఉభయంతో సామూహిక లలితా సహస్రనామ పారాయణ భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమాలలో ఆలయ చైర్మన్ సురేంద్ర యాదవ్, ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి గిరి కృష్ణ, అర్చక బృందం, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు