BREAKING
ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం తాడిగడప అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు బోడె ప్రసాద్ ప్రచారం సింగూరుకు మరో సువర్ణావకాశం: టాటా నానో నిష్క్రమణ తర్వాత 18 ఏళ్లకు ట్రక్కుల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అశోక్ లేలాండ్! తాడిగడపలో కూటమి అభ్యర్థులకు బోడె హేమ ప్రచారం

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులకు పిలుపు..

Select Suryaa Now
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులకు పిలుపు..

గొల్లనపల్లి (గన్నవరం),  మేజర్ న్యూస్ : మాదకద్రవ్యాలకు బానిస కావడం ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తుందని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయాలని నీతోడు మానసిక వికాస కేంద్రం జోనల్ కోఆర్డినేటర్ డి. వెంకటేశ్వరరావు సూచించారు. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను అలవరచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చన్నారు. నవజీవన్ బాల భవన్, విజయవాడ ఆధ్వర్యంలో శుక్రవారం గొల్లనపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘డ్రగ్స్‌కు నో చెప్పండి – జీవితానికి ఎస్ చెప్పండి’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు, కుటుంబాలపై ప్రభావం, విద్యాభ్యాసం, భవిష్యత్తుకు ఎదురయ్యే ముప్పులను తమ వ్యాసాల్లో వివరించారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలనే సందేశాన్ని చాటారు. ఈ కార్యక్రమాన్ని నీతోడు మానసిక వికాస కేంద్రం జోనల్ కోఆర్డినేటర్ డి. వెంకటేశ్వరరావు నిర్వహించగా, పాఠశాల ఇన్‌చార్జి కె. సావిత్రి, వృత్తి విద్యా ఉపాధ్యాయుడు ఇ. మధు విద్యార్థులను ప్రోత్సహించి సహకరించారు. వ్యాసరచన పోటీలో కె. సంధ్య ప్రథమ, ఎస్.కె. మెహరాజ్ ద్వితీయ, యోహాన్ ఆనంద్ తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి, వ్యసన రహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడమే కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గన్నవరం, కృష్ణాజిల్లా.