BREAKING
రీ సర్వే పేరుకే న్యాయం జరగడం లేదు. యూఎస్ యూ తనిఖీ నుంచి ఇటలీ నిష్క్రమణకు ముప్పు-సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక భాకారపేట సీఐ గా పి. తిమ్మయ్య. సెప్టా సంక్షోభం సమయంలో స్పానిష్ జలాల్లోకి మొరాకో నావికాదళ నౌకలు అక్టోబర్ 15న చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేత..కలెక్టర్ మహేష్ కుమార్. హనుమాన్ నగర్‌లో మహిళల చే దసరా వేడుకలు ప్రజా నాయకుడు కన్నుమూత! కొత్తూరులో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి రైతుల భూములు లాక్కుంటూ కన్నీళ్లు మిగులుస్తారా..? బాధిత రైతుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శ 17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులే కీలకం…:సి ఐ ఐ ప్రాంతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్ మహేష్ కుమార్.. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వాల ప్రాధాన్యత అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

డిసెంబరు నాటికి ఆర్టీసీకి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు - ఈడీ జగదీష్ బాబు

Select Suryaa Now
డిసెంబరు నాటికి ఆర్టీసీకి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు  - ఈడీ జగదీష్ బాబు

ఉదయగిరి,మేజర్ న్యూస్ :   డిసెంబరు మాసం నాటికి ఆర్టీసీకి నూతనంగా ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.జగీష్ బా బు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా డిపోలోని పలు విభాగాలను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణీకుల రద్దీని బట్టి గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడుపుతామన్నారు. డిపోకు రాబడి రాని సర్వీసులను నడపడం కష్టమన్నారు. దసరా పర్వదినం సందర్భంగా ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నామన్నారు. ఉదయగిరి డిపో పరిధిలో ఫిర్యాదుల శాతం చాలా తక్కువుగా ఉందన్నారు. డిపో అభివృద్ధికి ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. త్వరలో ఉదయగిరి- పోరుమామిళ్ళ మార్గంలో బస్సు సర్వీసు నడిపేలా చర్యలు చేపడతున్నామన్నారు. అనంతరం డిపో అధికారు లు, కార్మికులు ఆయన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రమేష్ కు మార్, సీఐ నాగభూషణం, సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.