డిక్షీలియా పై అవగాహన కార్యక్రమం
నిజాంపట్నం, మేజర్ న్యూస్: డిక్సీలి యా అనేది ఒక అభ్యాసన వైకల్యం అని పిల్లలు చదవడం, రాయడం, మాట్లాడటం, మరియు పదాలను లేదా అక్షరాలను గుర్తించడంలో ఇబ్బంది కలిగి ఉంటారని మండల విద్యాశాఖ అధికారి ఆర్. శోభా చంద్ అన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర మరియు జిల్లా అధికారుల ఆదేశాలు మేరకు గురువారం నిజాంపట్నంలోని భవిత సెంటర్ నందు డిక్సీలియా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ శోభాచంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పిల్లల యొక్క మెదడు ప్రాసెస్ చేసే విధానంలో తేడా తప్ప మరొకటి ఏమీ లేదని వీరు కూడా అందరిలాగే నేర్చుకోవాలని తపన కలిగి ఉంటారని ఈ పిల్లలు యొక్క అభివృద్ధి కి మనమందరం సహకరించాలని ఆయన తెలియజేశారు. అదేవిధంగా సమగ్ర శిక్ష ద్వారా అందించే అన్ని సౌకర్యాలు, సదుపాయాలను సకాలంలో వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం మే నెలలో జరిగినటువంటి ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో కొత్తగా గుర్తించిన వినికిడి లోపాల కలిగిన ఇద్దరు చిన్నారులకు హియరింగ్ ఎయిడ్స్ అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎన్. వెంకటేశ్వరరావు, సహిత విద్యా ఉపాధ్యాయులు శ్రీ వేల్పుల విజయ్ కుమార్, మూల్పూరు కల్పన, యూనిట్. ఉమా మహేష్, పిల్లలు, వారి తల్లిదండ్రులు, అంగన్ వాడి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.