డి ఆర్ ఓ గా బాధ్యతలు చేపట్టిన ఎం. శ్రీదేవి.
సూర్య ప్రతినిధి, మార్కాపురం. మార్కాపురం డిఆర్ఓగా ఎం. శ్రీదేవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్ లోని ఆమె ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు డిఆర్ఓగా పనిచేస్తూ బదిలీపై మార్కాపురం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా రెవిన్యూ సిబ్బంది, పలువురు తహసిల్దారులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ను నూతన డిఆర్ఓ మర్యాదపూర్వకంగా కలిశారు.