BREAKING
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు

ధార్మిక సేవలో "కోట్ల" దంపతులు సాయి ఆశ్రమంలో భక్తులకు అన్నదాన వితరణ

Select Suryaa Now
ధార్మిక సేవలో "కోట్ల" దంపతులు    సాయి ఆశ్రమంలో భక్తులకు అన్నదాన వితరణ


పూసపాటి రేగ, అక్టోబర్ 1, మేజర్ న్యూస్: మానవీయత, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అంటే ఆ దంపతులకు ఎంతో ప్రీతికరం . ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా మేమున్నామన్న భరోసా కల్పించడమే కాకుండా ఆర్థిక సాయం చేస్తున్న కోట్ల కుటుంబం అదే రీతిలో శిరిడి సాయి ఆశ్రమానికి వచ్చే భక్తులకు కూడా ఆలయం నుంచి ఎటువంటి ఆకలితో వెళ్ళకూడదు అన్న రఘు దంపతుల ఆశయం కార్యరూపం దాల్చుతోంది. మండలంలోని కందివలస లో ఉన్న మహిమాన్విత శిరిడి సాయి ఆలయానికి ప్రతి గురువారం వందల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. గతంలో వచ్చిన భక్తులంతా తీర్థ ప్రసాదాలు తీసుకుని మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో అది చూసి చలించిన కోట్ల రఘు తో పాటు అతని ధర్మపత్ని రేవతమ్మ కూడా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయాలన్న సంకల్పం వారి మదిలో మెలిగింది. నెల్లిమర్ల నియోజకవర్గం లో ఉన్న పలు దేవాలయాల నిర్మాణాలకు కోట్ల దంపతులు ఆర్థిక సాయం చేయడమే కాకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా ఆర్థిక సాయం చేసి భక్తుల మదిలో పునీతమయ్యారు. అందులో భాగంగా కందివలసలో మహిమాన్విత షిరిడి సాయి గురు పౌర్ణమి వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆ భక్తుల అన్నదాన కార్యక్రమానికి కోట్ల దంపతులు తమ వంతు సహాయంగా లక్ష వరకు అన్నదాన కార్యక్రమానికి అయ్యే ప్రస్తుత సామాగ్రి సమకూరుస్తుంటారు. అందులో భాగంగా ప్రతి గురువారం వందల సంఖ్యలో వచ్చే భక్తులకు కోట్ల రఘు అతని ధర్మపత్ని రేవతమ్మ ఇరువురు షిరిడి సాయి ఆలయాన్ని దర్శించడమే కాకుండా వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్వయంగా భక్తులకు వితరణ చేసి భక్తుల ఇబ్బందులను కూడా అడిగి తెలుసుకుంటూ, అన్నదాన కార్యక్రమానికి సేవ చేసే వారికి కూడా కోట్ల దంపతులు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తూ భక్తుల మదిలో ధార్మిక సేవకులుగా నిలవడంపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.