BREAKING
రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ... కందవాడకు ఉచిత అంబులెన్స్‌! శ్రీకాళహస్తి ప్రాంతంలో గంజాయి స్వాధీనం వ్యక్తి అరెస్ట్ వెలమలకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలి..... * జిల్లా కొప్పుల వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ * డేటా సెంటర్లుగా మూతపడిన అణు విద్యుత్ కేంద్రాలు... ఈఓఎన్ సమాలోచనలు పంట అవశేషాలతో జీవ ఇంధన ఉత్పత్తిపై రైతులకు అవగాహన! తెలుగుదేశం పార్టీకి గోవిందరావు చేసిన సేవలు చిరస్మరణీయం బలపడిన అమెరికా డాలర్... ఫెడ్ రేట్ల అంచనాలతో పడిపోయిన బ్రిటిష్ పౌండ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు - సిపిఎం వోక్స్ వాగన్ ప్రధాన ప్లాంట్‌లో 'గేమ్‌ఛేంజర్' మోడల్ ఉత్పత్తి నిలిపివేత ముడిచమురు ధరల పెరుగుదల: బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ $92 విశాఖపట్నం వైద్యుల అరుదైన ఘనత: హైదరాబాద్ మహిళకు సంక్లిష్టమైన వెన్నుపాము కణితి తొలగింపు

దేవాలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద నేరాలు జరగకుండా చర్యలు చేపట్టాలి.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ *

Select Suryaa Now
దేవాలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద నేరాలు జరగకుండా చర్యలు చేపట్టాలి.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ *

విజయనగరం, సూర్య : కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని దేవాలయాలు, శివాలయాలు, నదీ తీరాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యస్నాన ఘాట్లకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకొని దొంగతనాలు, జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, మొబైల్ ఫోన్ల చోరీలు వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తమ వ్యక్తిగత భద్రతపై జాగ్రత్తవహించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్  మాట్లాడుతూ 
జిల్లాలోని ప్రధాన దేవాలయాలు, శివాలయాలు, పుణ్యక్షేత్రాలు, నదీ ఘాట్లు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి.
నదులు, కోనేరు, సముద్రాల వద్ద స్నాన ఘాట్ ల వద్ద ప్రజలు గమనించేలా హెచ్చరిక బోర్డులను, సంబంధిత అధికారులతో మాట్లాడి లైటింగ్  ఏర్పాటు చేయాలన్నారు. రద్దీగా ఉండే ఆలయాల వద్ద సాధారణ దుస్తుల్లో పోలీసు సిబ్బందిని నియమించి జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, ఇతర ఆస్తి సంబంధిత నేరాల నివారణకు చర్యలు చేపట్టాలి. దేవాలయాల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. దేవాలయాల వద్ద వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మహిళలు, వృద్ధులు, పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీతో మాట్లాడి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయ కమిటీలు, నిర్వాహకులు, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని సంబంధిత పోలీసు అధికారులు భద్రతా చర్యలను పర్యవేక్షించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం గమనిస్తూ, నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలన్నారు. పోలీసుల సహాయం కోసం డయల్ 112/100కు ఫోను చేయాలని ప్రజలను జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్  కోరారు.