BREAKING
పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల ఠానేలంక గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు...విద్యార్థినులతో మేజిస్ట్రేట్ ముఖాముఖి... నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు.

డీసీసీబీ లో జవాబుదారీ విధానం పెంచుతాం

Select Suryaa Now
డీసీసీబీ లో జవాబుదారీ విధానం పెంచుతాం

విజయనగరం ప్రతినిధి మేజర్ న్యూస్ : శుక్రవారం తప్పులు జరిగినట్లు ఆరోపణలు ఉన్న సహకార సంఘాల్లోనూ సమగ్ర దర్యాప్తు చేపడతామని నాగార్జున తెలిపారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. తద్వారా వసూలు చేసిన డబ్బును జిల్లాలోని రైతాంగం కోసం ఉపయోగించి ప్రజలకు, రైతులకు డీసీసీబీపై నమ్మకం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. 0.5% వడ్డీ తగ్గింపు రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఎకరాకు ఋణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పెంచినట్లు తెలిపారు. రుణాలపై వడ్డీ రేటును 12 శాతం నుంచి 11.5 శాతానికి తగ్గించటం వలన డీసీసీబీ పై 5 కోట్ల భారం పడిందని పేరొన్నారు. నాబార్డ్ వారు ఇస్తున్న ప్రతి రూపాయి కూడా పూర్తి పరదర్సకతతో డీసీసీబీ ద్వారా రైతాంగానికి రుణాలు మంజూరు చేస్తున్నాము. ఋణాల మంజూరులో ఎవరైనా లంచాలకు పాల్పడితే తనకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి డిసిసిబి బ్రాంచ్ కు బహుళ న్యాయ సలహాదారులు సంస్థాగత సంస్కరణలో భాగంగా సహకార సంఘాలు,డిసిసిబి శాఖల ఋణాలకు సంబంధించిన న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ఇది వరకు మూడు డీసీసీబీ బ్రాంచ్ లకు గాను ఉన్న ఒక్క న్యాయ సలహాదారుడిని  పెంచుతూ  ప్రతి డీసీసీబీ శాఖకు ఇద్దరు లేదా ముగ్గురు న్యాయ సలహాదారులను నియమిస్తున్నామని దీనివల్ల న్యాయపరమైన అడ్డంకులకు త్వరితగతిన పరస్కారం కలుగుతుంది అని నాగార్జున వెల్లడించారు.

గ్రీవెన్స్‌కు స్పందన : ప్రజలు, రైతులు, సహకార సంఘాల ప్రతినిధుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని నాగార్జున తెలిపారు. అందిన వినతులను పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.