దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ ను(పర్యావరణహిత బాణసంచా) మాత్రమే కొనుగోలు చేయండి* *జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి*
*దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ ను(పర్యావరణహిత బాణసంచా) మాత్రమే కొనుగోలు చేయండి*
*జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి*
కర్నూల మేజర్‌న్యూస్ ప్రతినిది02: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనల మేరకు దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ ను(పర్యావరణహిత బాణసంచా) మాత్రమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ప్రజలకు సూచించారు.
గ్రీన్ క్రాకర్స్ శబ్దరహితంగా, కాలుష్యరహితంగా ఉండడం వల్ల పర్యావరణానికి హాని కలిగించే స్థితి ఉండదని, అదేవిధంగా దీపావళి సమయంలో కాల్చేటటువంటి బాణాసంచాని నిర్దేశించిన సమయాలలో మాత్రమే కాల్చాలని సూచించారు. బ్యాన్ చేసిన బాణాసంచాను మరియు కాల పరిమితి దాటిన బాణాసంచాను ఉపయోగించకూడదన్నారు. గ్రీన్ క్రాకర్స్ ను అందించే
వనిత,స్టాండర్డ్,కాలేశ్వర,రవీంద్ర కొరనేషన్,వర్షిని,జెన్నిస్ గణేష్ కంపెనీల ద్వారా లభ్యమయ్యే పర్యావరణహితమైన గ్రీన్ క్రాకర్స్ ను కొనుగోలు చేసి ఉపయోగించాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.