BREAKING
గిరిజన సంఘం సాంస్కృతి కార్యక్రమాలు 37వ డివిజన్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పంటల బీమాకు దరఖాస్తు చేసుకోండి: వ్యవసాయ అధికారి నార్పలలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు.. వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం అయ్యప్ప మాల ధరించిన తిప్పాపూర్ గ్రామ భక్తులు విహార యాత్రల వల్ల విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కలుగుతుంది కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంత వెంకట్రామిరెడ్డి. ఐదవ సారి సర్పంచ్ బరిలో విచారపు పావని సిద్ధుగాడి లవ్ స్టోరీకి ఊహించని ఆదరణ.. సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం ఆనందం 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ గ్రాండ్ రీఎంట్రీ.. అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్ర! ప్రశాంతంగా ముగిసిన రెండో దశ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక నర్సంపేటలో బిఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు పై గులాబీ శ్రేణుల మండిపాటు

డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం : కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆవేదన

Select Suryaa Now
డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం : కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆవేదన

మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై దేశ రాజకీయాల్లో బిజెపి చేస్తున్న ద్వంద వైఖరి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ పేర్కొన్నారు.ఆదివారం మదనపల్లె పట్టణం,ఇందిరా నగర్ దొంతివీధిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళ బిల్లు,డీలిమిటేషన్ ప్రక్రియకు తాము వ్యతిరేకం కాదని,రెండు వేరువేరుగా తీసుకు రావడానికి కేంద్రానికి ఇబ్బంది ఏమీటని ప్రశ్నించారు.దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న సుమారు 24 శాతం లోక్‌సభ ప్రాతినిధ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని డిమాండ్ చేశారు.లోక్‌సభ సీట్లను 850కి పెంచుతారన్న ప్రచారం నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం పడుతోందననే ఆందోళన వ్యక్తం చేశారు.మహిళా రిజర్వేషన్లు,డీలిమిటేషన్‌పై  తనదైన శైలిలో ప్రశ్నించారు.గతంలో డీలిమిటేషన్,మహిళ బిల్లు వ్యతిరేకించిన తమిళనాడు డిఎంకే,తెలంగాణ బిఆర్ఎస్,ఆప్ తదితర పార్టీలు ఇప్పుడు మద్దతు ఇవ్వడం వెనుక దాగివున్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా మద్దతు ఇస్తారని కేంద్రంలోని బిజెపి ప్రకటించడం వెనుక వారి ప్రలోభాలు ఏవిధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా కేంద్రంలో భాగస్వామి అయిన సిఎం చంద్రబాబునాయుడు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరడం భవిష్యత్తు తరాలకు అన్యాయం చేయడమేనని విమర్శలు గుప్పించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చైతన్య,మహబూబ్ పీర్ పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి