BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

దసరా ఉత్సవాల్లో భక్తులకు

Select Suryaa Now
దసరా ఉత్సవాల్లో భక్తులకు

‘జగన్మాత దివ్య దర్శన్’ !

-సిఫార్సులు అక్కర్లేదు.. రూ.1,000తో అమ్మవారి ముఖ మండప దర్శనం

-‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా అక్టోబర్ 11, 12, 13 తేదీల టికెట్ల విడుదల

-కుమ్మరిపాలెం నుంచి కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం

-ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా బంగారు వాకిలి వద్ద అమ్మవారి దర్శనం

-సామాన్య భక్తులకు 8 గంటలపాటు ప్రత్యేక దర్శన సౌకర్యం..

-ఈవో వి.కె. శీనా నాయక్ వెల్లడి

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన ‘జగన్మాత దివ్య దర్శన్’ ప్రత్యేక దర్శన టికెట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ శుక్రవారం విడుదల చేశారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా భక్తులు రూ.1,000 టికెట్‌తో ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా అమ్మవారిని సమీపం నుంచి దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తొలి విడతగా అక్టోబర్ 11, 12, 13 తేదీల టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

‘మన మిత్ర’ వాట్సాప్‌లో టికెట్ల బుకింగ్

దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు ముందుగానే తమ దర్శన టికెట్లను బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ‘మన మిత్ర’ వాట్సాప్ సేవను వినియోగించుకోవాలని ఈవో సూచించారు. ఇందుకోసం 9552300009 నంబర్‌ను సంప్రదించి టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపారు. తొలి మూడు రోజులకు సంబంధించిన టికెట్లను విడుదల చేయగా, మూలా నక్షత్రం రోజును మినహాయించి మిగిలిన రోజులకు కూడా విడతల వారీగా టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. భక్తులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందస్తు బుకింగ్ చేసుకోవాలని, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూచించారు.

కుమ్మరిపాలెం నుంచి ఉచిత బస్సు సౌకర్యం

‘జగన్మాత దివ్య దర్శన్’ టికెట్ ధరను రూ.1,000గా నిర్ణయించారు. టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఉన్న టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఉచితంగా కొండపైకి తీసుకెళ్లనున్నారు. కొండపైకి చేరుకున్న అనంతరం ఓం టర్నింగ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా ఆలయంలోకి అనుమతిస్తారు. ముఖ మండపం (బంగారు వాకిలి) నుంచి శ్రీ జగన్మాత కనకదుర్గమ్మను అత్యంత సమీపంగా దర్శించుకునే అవకాశం కల్పించనున్నట్లు ఈవో వివరించారు. రద్దీ సమయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రవాణా, క్యూలైన్ల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

ఉచిత దర్శనానికి ప్రాధాన్యం.. ప్రత్యేక దర్శనానికి అదనపు సమయం

దసరా ఉత్సవాల సందర్భంగా సాధారణ భక్తుల కోసం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నాలుగు క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. గతంలో అందుబాటులో ఉన్న రూ.500, రూ.300, రూ.100 దర్శన టికెట్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 7.45 నుంచి 9.45 గంటల వరకు రూ.1,000 టికెట్ దర్శనం అందుబాటులో ఉంటుందని వివరించారు. మరోవైపు, ‘జగన్మాత దివ్య దర్శన్’ ద్వారా ఎలాంటి సిఫార్సులు లేకుండా సామాన్య భక్తులకు రోజుకు ఎనిమిది గంటలపాటు రూ.1,000 టికెట్‌పై ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఈవో విజ్ఞప్తి

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, దర్శన ఏర్పాట్లను సద్వినియోగం చేసుకోవాలని ఈవో వి.కె. శీనా నాయక్ కోరారు. ‘జగన్మాత దివ్య దర్శన్’ టికెట్లను అధికారిక వాట్సాప్ సేవ ద్వారానే బుక్ చేసుకోవాలని, నిర్ణీత సమయానికి చేరుకుని దర్శనం చేసుకోవాలని సూచించారు. సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం, రద్దీని క్రమబద్ధీకరించడం, ఎలాంటి సిఫార్సులు లేకుండా ప్రత్యేక దర్శనం అందించడం లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.