BREAKING
జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ గాంధీ ఫౌండేషన్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ 299 డివిజన్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సాయిపేట శ్రీనివాస్ ఫిలిప్స్ రికాల్ వివాదంలో విజయం సాధించిన డచ్ దిగ్గజం నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీకి ఏర్పాట్లు

దసరా సెలవుల్లో అదనపు తరగతులకు నిర్వహిస్తే సహించేది లేదు... ఏబీవీపీ

Select Suryaa Now
దసరా సెలవుల్లో అదనపు తరగతులకు నిర్వహిస్తే సహించేది లేదు... ఏబీవీపీ

వింజమూరు మేజర్ న్యూస్  :     ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులు సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు అదనపు తరగతులు నిర్వహించకుండా ప్రభుత్వ సెలవులు నిబంధనలను పాటించాలని అఖిలభారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ వింజమూరు శాఖ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఏబీవీపీ వింజమూరు నగర కార్యదర్శి గని వెంకట విష్ణువర్ధన్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు ఏడాది పొడవునా చదువుల ఒత్తిడితో ఉంటారని దసరా సెలవులు వారికి విశ్రాంతి తీసుకోవడానికి కుటుంబ సభ్యులతో గడపడానికి ఉపయోగపడాలన్నారు సెలవల సమయంలో కూడా అదనపు తరగతులు పేరుతో విద్యార్థులను కళాశాలకు రావాలని ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నారు విద్యార్థుల మానసిక శారీరిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థల యాజమాన్యాలు వ్యవహరించాలని సూచించారు ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులు సమయంలో అదనపు తరగతులు నిర్వహించకుండా విద్యాసంస్థలు సహకరించాలని విద్యార్థుల సెలవులు హక్కులకు భంగం కలిగించవద్దని కోరారు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే విద్యార్థుల హక్కులు పరిరక్షణ కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు విద్యార్థుల హక్కుల పరిరక్షణ ఏబీవీపీ లక్ష్యమని విద్యార్థులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని గని వెంకట విష్ణువర్ధన్ నాయుడు స్పష్టం చేశారు.