BREAKING
అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు

దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నగరం కళాశాల విద్యార్థుల ప్రతిభ

Select Suryaa Now
దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నగరం కళాశాల విద్యార్థుల ప్రతిభ

నగరం, మేజర్ న్యూస్: 
తమిళనాడులోని వినాయక మిషన్ విశ్వవిద్యాలయంలో ఈనెల  22-26 తేదీల్లో నిర్వహించిన దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి కళాశాలకు గౌరవ ప్రతిష్ఠలను తీసుకువచ్చారు. ఈ పోటీల్లో కళాశాలకు చెందిన బి.ఏ. రెండవ సంవత్సరం విద్యార్థి సిహెచ్. వంశీ  +110 కిలోల బరువు విభాగంలో పోటీపడి అద్భుత ప్రదర్శనతో మూడవ స్థానం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. స్నాచ్ విభాగంలో 142 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 162 కిలోల బరువును ఎత్తి తన క్రీడా ప్రతిభను చాటుకున్నాడు. అలాగే బీసీ ఏ మూడవ సంవత్సరం విద్యార్థి ఏ. అరుణేష్ బాబు 110 కిలోల బరువు విభాగంలో పోటీపడి ఐదవ స్థానాన్ని సాధించాడు. స్నాచ్‌లో 140 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 165 కిలోల బరువును ఎత్తి ప్రశంసనీయమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ విజయంపై కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ వల్లభనేని  బుచ్చయ్య చౌదరి, ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ, వైస్ ప్రిన్సిపల్ ఆర్. ప్రసన్న బాబు, కార్యాలయ సూపరింటెండెంట్ పి. అమరేష్ రెడ్డి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ వి. సాంబమూర్తి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.